![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -145 లో... శ్రీలత ఎలాగైనా సందీప్ ని జనరల్ మేనేజర్ ని చేయాలని అనుకుంటుంది. ఇంట్లో ఇంత జరుగుతున్నా మా అయనని జనరల్ మేనేజర్ ని చెయ్యడానికి బావగారు ఏమైనా పిచ్చోడా అని శ్రీవల్లి అంటుంది. అవును వాడు అమ్మ పిచ్చోడు. ఎలాంటి స్వార్థం లేదు.. మా అమ్మకి అనుకునే పిచ్చోడని శ్రీలత అంటుంది. జనరల్ మేనేజర్ అవ్వడానికి నేనొక ప్లాన్ చెప్తానంటూ సందీప్ కి శ్రీలత ప్లాన్ చెప్తుంది. ముందు జనరల్ మేనేజర్ అవ్వు.. ఆ తర్వాత ఆఫీస్ ని మొత్తం నీ గుప్పిట్లో పెట్టుకోమని సందీప్ కి చెప్తుంది శ్రీలత.
మరొకవైపు సీతాకాంత్ నిద్రలేస్తు.. రామలక్ష్మిని పిలిచి తన ముందు నిల్చొమని చెప్తాడు. సీతాకాంత్ ముందుకి రామలక్ష్మి రాగానే.. సీతకాంత్ నిద్రలేచి రామలక్ష్మి మొహం చూస్తాడు. మొన్న నీ మొహం చూసినందుకే అవార్డు వచ్చింది. ఈ రోజు ఇంటర్వ్యూ ఉంది. అది సక్సెస్ అయితే ఫారెన్ నుండి కూడా క్లయింట్స్ వస్తారని సీతాకాంత్ అంటాడు. మీరు రెడీ అవ్వండి.. నేను కాఫీ తెస్తానంటూ రామలక్ష్మి వెళ్తుంది. ఆ తర్వాత న్యూస్ ఛానెల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు. రామలక్ష్మి హారతి తీసుకొని వెళ్లి.. సందీప్, శ్రీలత, శ్రీవల్లిలకి ఇస్తుంది. వాళ్ళు హారతి తీసుకోరు. మీరు రాత్రి అన్నారు కదా.. అది ఇప్పుడు జరగబోతుందని శ్రీలతకి రామలక్ష్మి చెప్పి వెళ్తుంది. రామలక్ష్మి ఇంటర్వ్యూ చేసే ఆవిడకి కాఫీ ఇస్తూ.. ఈ ప్రశ్న సీతకాంత్ ని అడగండి అని ఒక స్లిప్ పై రాసి తన దగ్గర పడేస్తుంది. అది చూసిన ఆవిడా అడిగితే మా ఛానెల్ కి మంచి రేటింగ్ వస్తుందని అనుకుంటుంది.
ఆ తర్వాత సీతాకాంత్ ఏ సూట్ వేసుకోవాలో కన్ఫ్యూజన్ అవుతుంటే.. అప్పుడే రామలక్ష్మి వెళ్ళి తన చీరకి మ్యాచింగ్ సూట్ సెలెక్ట్ చేసి ఇస్తుంది. మ్యాచింగ్ సెలక్ట్ చేసావా అంటూ సీతాకాంత్ నవ్వుకుంటాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంది. అందులో మీకు పెళ్లి అయిందా.. అసలు మీ భార్యని పరిచయం చెయ్యకపోవడానికి కారణమేంటని ఇంటర్వ్యూ చేసే వారు అడుగుతారు. అది నా పర్సనల్ అంటూ సీతాకాంత్ కోపంగా వెళ్ళిపోతాడు. దాంతో రామలక్ష్మి డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |